Share News

నేటికీ వైసీపీ రంగులే..!

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:10 AM

ప్రభుత్వం మారి 16 నెలలైనా.. పట్టణంలోని ఒకటో వార్డులో ఉన్న సచివాలయ భవనం రంగు మాత్రం మారలేదు.

నేటికీ  వైసీపీ రంగులే..!
వైసీపీ రంగుల్లో సచివాలయం

రాయదుర్గం రూరల్‌, సెప్టెంబరు 14(ఆంధ్రజోతి): ప్రభుత్వం మారి 16 నెలలైనా.. పట్టణంలోని ఒకటో వార్డులో ఉన్న సచివాలయ భవనం రంగు మాత్రం మారలేదు. ఆ భవనానికి నేటికీ వైసీపీ రంగులే ఉన్నాయి. అధికారులు, పాలకులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంపై కూటమి నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని 1వ వార్డు టీడీపీ వార్డు ఇనచార్జి తిప్పేస్వామి, నాయకులు బలె శంకర్‌ కోరుతున్నారు.

Updated Date - Sep 15 , 2025 | 12:10 AM