వైభవంగా ఈశ్వరమ్మ గ్రామోత్సవం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:21 AM
పట్టణంలో గురువారం రాత్రి ఈశ్వరమ్మ దేవి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఉరవకొండ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): పట్టణంలో గురువారం రాత్రి ఈశ్వరమ్మ దేవి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తిని ట్రాక్టర్‌లో కొలువు దీర్చి ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.