ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:37 AM
పట్టణంలో బుధవారం గుంతకల్లు, ఆదోని ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, పార్థసారథి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు.
గుంతకల్లుటౌన, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): పట్టణంలో బుధవారం గుంతకల్లు, ఆదోని ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, పార్థసారథి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. స్ధానిక రైల్వే క్రీడామైదానం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు జాతీయ జెండాలతో కూటమి నాయకులు, విద్యార్థులు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొలమి రామాంజినేయులు, హరిహరనాథ్, విశ్వనాథ్, విజయలక్ష్మి, పురంధర్, కసాపురం రవి, జనసేన నాయకులు వాసిగిరి మణికంఠ, గాజుల రఘు పాల్గొన్నారు.