Share News

గార్మెంట్స్‌ పరిశ్రమలతో ఉపాధి : సెర్ఫ్‌

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:21 PM

గార్మెంట్స్‌ పరిశ్రమ ద్వా రా మహిళలకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని సెర్ఫ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ పద్మావతి పేర్కొన్నారు.

గార్మెంట్స్‌ పరిశ్రమలతో ఉపాధి : సెర్ఫ్‌
మహిళలతో మాట్లాడుతున్న సెర్ఫ్‌ డైరెక్టర్‌

ఉరవకొండ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): గార్మెంట్స్‌ పరిశ్రమ ద్వా రా మహిళలకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని సెర్ఫ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ పద్మావతి పేర్కొన్నారు. పట్టణంలోని వెలుగు కార్యాలయంలో టైలరింగ్‌లో నైపుణ్యం కలిగిన మహిళలతో సోమవారం సమావేశం నిర్వహించారు. గార్మెంట్‌ పరిశ్రమలో మహిళలకు ఉపా ధి కల్పించాలన్నదే లక్ష్యమన్నారు. ఇందులో డీఆర్‌డీఏ పీడీ శైలజ, హ్యాండ్‌ టెక్స్‌టైల్స్‌ ఏడీ వరప్రసాద్‌, ఏసీ శివప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 11:21 PM