Share News

wagesఉపాధి వేతనాలు చెల్లించాలి

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:29 PM

ఉపాధి పథకం కూలీలకు బకాయి వేతనాలను చెల్లించాలని సీపీఐ ఆధ్వర్యంలో కూలీలు గురువారం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు.

wagesఉపాధి వేతనాలు చెల్లించాలి
ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): ఉపాధి పథకం కూలీలకు బకాయి వేతనాలను చెల్లించాలని సీపీఐ ఆధ్వర్యంలో కూలీలు గురువారం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సీపీఐ డివిజన కార్యదర్శి ఆంజి, మండల కార్యదర్శి చలపతినాయుడు మాట్లాడుతూ.. మూడు నెలలుగా ఉపాధి కూలీలకు వేతనాలు రాలేదన్నారు. ఎండలు మండుతున్న ఈ రోజుల్లో పని ప్రదేశాల్లో కనీసం సౌకర్యాలు అధికారులు కల్పించడం లేదని, కనీసం మెడికల్‌ కిట్‌ కూడా అందుబాటులో ఉండటం లేదని వాపోయారు. ఇప్పటికైనా కూలీలకు బకాయిలు మంజూరు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓ రాబర్టు విల్సనకు వినతిపత్రం అందించారు.

Updated Date - Apr 17 , 2025 | 11:29 PM