Share News

మూడు నెలలుగా అందని ఉపాధి బిల్లులు

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:43 PM

జాతీయ ఉపాధి హమీ పథకం కింద చేసిన పనులకు కూలీలకు మూడు నెలలుగా బిల్లులు అందకపోవడంతో లబోదిబోమంటున్నారు.

మూడు నెలలుగా అందని ఉపాధి బిల్లులు
కూడేరు శివారులో పనులు చేస్తున్న కూలీలు

కూడేరు, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధి హమీ పథకం కింద చేసిన పనులకు కూలీలకు మూడు నెలలుగా బిల్లులు అందకపోవడంతో లబోదిబోమంటున్నారు. మండలంలో మూడు నెలల్లో 8,553 మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్లారు. వీరికి జూన, జూలై, ఆగస్టు నెలల్లో చేసిన పనులకు గాను దాదాపు రూ, 1,01,15,708 కూలి డబ్బులు పెండింగ్‌ ఉందని అధికారులు చెబుతున్నారు. మూడు నెలలైనా చేసిన పనులకు బిల్లులు అందకపోవడంతో కూలీలు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కుటుంబం పోషణ భారమైందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సకాలంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:43 PM