Share News

కూలేందుకు సిద్ధంగా ఉన్న విద్యుత స్తంభాలు

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:53 AM

మండలంలోని గోనబావి బీసీ కాలనీలో పలు మెయిన లైన విద్యుత స్తంభాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి.

కూలేందుకు సిద్ధంగా ఉన్న విద్యుత స్తంభాలు

గుమ్మఘట్ట, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని గోనబావి బీసీ కాలనీలో పలు మెయిన లైన విద్యుత స్తంభాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ నివాసముంటున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఈదురు గాలులకు ఏ క్షణంలో స్తంభాలు కూలి.. ప్రమాదం సంభవిస్తుందోనని భయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. విద్యుతశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Aug 16 , 2025 | 12:53 AM