ఇళ్ల మధ్యలో విద్యుత స్తంభం
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:56 AM
పాత గుంతకల్లులోని వా ల్మీకి విగ్రహం పక్కన ఇళ్ల మఽధ్య లో 11కేవీ తీగల కోసం ఇనుప విద్యుత స్తంభాన్ని ట్రాన్సకో అధికారులు ఏర్పాటు చేశారు.
గుంతకల్లుటౌన, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): పాత గుంతకల్లులోని వా ల్మీకి విగ్రహం పక్కన ఇళ్ల మఽధ్య లో 11కేవీ తీగల కోసం ఇనుప విద్యుత స్తంభాన్ని ట్రాన్సకో అధికారులు ఏర్పాటు చేశారు. దానికి సీ్ట్రట్ లైట్ ఏర్పాటు చేశారు. గాలి, వాన వస్తే ఆ ఇళ్లలోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. గాలికి విద్యుత తీగలు ఒకదానికొకటి తగిలి మంటల వ్యాపించి నిప్పురవ్వలు కిందపడుతున్నాయి. ఇక వర్షం వస్తే ఇంటి గొడలకు కరెంట్ ప్రసారం అవుతోంది. 20 సంవత్సరాల నుంచి ఈ విద్యుత స్తంభాన్ని మార్చాలని విద్యుత శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత అధికారులు స్పం దించి విద్యుత స్తంభాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.