ఇళ్లపై విద్యుత తీగలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:39 PM
పట్టణంలోని పలు ఇళ్లపై తక్కువ ఎత్తులోనే విద్యుత తీగలు వేలాడుతున్నాయి. దీంతో ఇంటిపైకి ఎక్కాలంటే ప్రజలు జంకుతున్నారు.
గుంతకల్లుటౌన, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు ఇళ్లపై తక్కువ ఎత్తులోనే విద్యుత తీగలు వేలాడుతున్నాయి. దీంతో ఇంటిపైకి ఎక్కాలంటే ప్రజలు జంకుతున్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలువ గడ్డ ఏరియాలో 25సంవత్సరాల క్రితం విద్యుత స్తంభాలను ఇళ్ల ముందర ఏర్పాటు చేశారు. విద్యుత స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో తీగలు తక్కువ ఎత్తులోనే వేలాడుతున్నాయి. చిన్నపాటి గాలీవాన వచిన్నా.. తీగలు ఒకదానితో ఒకటి తగిలి.. నిప్పులు పడుతున్నాయని, ఫ్యూజ్‌లు పోతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. అంతేకాకుండా పలుమార్లు షార్ట్‌సర్కూట్ అవుతుండటంతో ఇళ్లలోని విద్యుత గృహోపకరణాలు కాలిపోతున్నాయన్నారు. అలాగే గంగానగర్ నుంచి కాలువ గడ్డకు వెళ్లే దారిలో బీజీసీ కాలువ వద్ద విద్యుత స్తంభం కూలడానికి సిద్ధంగా ఉంది. అది ఎప్పుడు కూలిపోతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీనిపై పలుమార్లు విద్యుతశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత స్తంభాలు, తీగలను సరిచేయాలని కోరుతున్నారు. దీనిపై విద్యుత ఏడీఈ నాగేంద్రను వివరణ కోరగా.. హౌసింగ్ బోర్డు కాలువ గడ్డ ఏరియాలో కిందకువేలాడుతున్న విద్యుత తీగలను సరి చేస్తామని, దెబ్బతిన్న విద్యుత స్తంభాలను మారుస్తామని అన్నారు.