ఇంటిపై కూలిన విద్యుత స్తంభం
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:57 PM
స్థానిక సత్యసాయి భజన మందిరం సమీపంలో ఇంటిపైన ఓ విద్యుత స్తంభం కూలింది. భారీగా శబ్దం రావడంతో ఆ ఇంట్లోని వారు బయటకు పరుగులు తీశారు.
ఉరవకొండ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): స్థానిక సత్యసాయి భజన మందిరం సమీపంలో ఇంటిపైన ఓ విద్యుత స్తంభం కూలింది. భారీగా శబ్దం రావడంతో ఆ ఇంట్లోని వారు బయటకు పరుగులు తీశారు. విషయాన్ని వెంటనే విద్యుత శాఖ అధికారులకు తెలిపారు. అధికారులు విద్యుత సరఫరాను నిలిపివేసి.. మరమ్మతులు చేపట్టారు. స్తంభం శిఽథిలావస్థకు చేరుకోవడంతోనే కూలిందని స్థానికులు తెలిపారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న స్తంభాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.