ప్రతి ఉపాధి కూలీకి ఈకేవైసీ తప్పనిసరి
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:17 AM
ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే ప్రతి కూలీకి లబ్ధి చేకూర్చేందుకే ఈకేవైసీ నమోదు తప్పనిసరి అని డ్వామా పీడీ సలీంబాషా తెలిపారు.
బెళుగుప్ప, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే ప్రతి కూలీకి లబ్ధి చేకూర్చేందుకే ఈకేవైసీ నమోదు తప్పనిసరి అని డ్వామా పీడీ సలీంబాషా తెలిపారు. మండల కేంద్రంలో ఉపాధి సిబ్బంది నిర్వహిస్తున్న ఈకేవైసీ నమోదు ప్రక్రియను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈకేవైసీ వల్ల కలిగే లాభాలపై ఉపాధి కూలీలకు ఆయన అవగాహన కల్పించారు. ఈకేవైసీ నమోదును వేగవంతం చేయాలని ఏపీఓ మురళికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా 5,82,919 మంది కూలీలు ఉండగా 2,90,744 మందికి ఈకేవైసీ పూర్తి చేశామన్నారు. ఈ నెల 20 లోపు ఈకేవైసీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట టీఏ అవినాష్, ఎఫ్‌ఏలు యర్రిస్వామి, శివ, వన్నూరుస్వామి, తిప్పేస్వామి, సాయి గణేష్ ఉన్నారు.