education: సెక్టోరల్స్ జాబితా విడుదల
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:15 AM
ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. ఎన్నో వివాదాలు, అభ్యంతరాలతో ఏడాదికిపైగా నాన్చుతూ వచ్చిన సమగ్రశిక్షలో సెక్టోరల్స్ ఎంపిక పూర్తయ్యింది. ఆమేరకు ఎంపికైన సెక్టోరల్స్ జాబితాకు కమిషనర్ విజయరామరాజు ఆమోదం వేసి పంపగా, డీఈఓ ప్రసాద్‌బాబు జాబితాను ప్రకటించి సోమవారం ఆర్డర్లు ఇచ్చారు.
అనంతపురంవిద్య, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. ఎన్నో వివాదాలు, అభ్యంతరాలతో ఏడాదికిపైగా నాన్చుతూ వచ్చిన సమగ్రశిక్షలో సెక్టోరల్స్ ఎంపిక పూర్తయ్యింది. ఆమేరకు ఎంపికైన సెక్టోరల్స్ జాబితాకు కమిషనర్ విజయరామరాజు ఆమోదం వేసి పంపగా, డీఈఓ ప్రసాద్‌బాబు జాబితాను ప్రకటించి సోమవారం ఆర్డర్లు ఇచ్చారు.
ఎంపికైన వారు వీరే..
ఐఈఆర్టీ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో పెండింగ్ పెట్టారు, ప్రస్తుతం ఐదుసెక్టోరల్స్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించారు. అందులో ఏఎస్‌ఓగా ఎన. నరసింహారెడ్డి(పిజిక్స్‌టీచర్,దేవగిరి జడ్పీహెచఎస్), అసిస్టెంట్ సీఎంఓగా కె.చంద్రశేఖర్( ఎంపీపీస్కూల్, యర్రగుంట్ల, గార్లదిన్నె), ఏఎంఓగా పి.వేణుగోపాల్ (జడ్పీహెచఎస్, గోనబావి), అలెస్కోగా కె.రామచంద్ర (పీఎస్‌హెచఎం, రాయలప్పదొడ్డి), బి.నారాయణస్వామి (ఎంపీపీఎస్, కోటంక, గార్లదిన్నె) నియమితులయ్యారు.