పరిశ్రమల ఏర్పాటుతో మహిళల ఆర్థికాభివృద్ధి
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:01 AM
చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ ఇస్తోందని, దీన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని పరిశ్రమలశాఖ జిల్లా ఏడీ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
యాడికి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ ఇస్తోందని, దీన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని పరిశ్రమలశాఖ జిల్లా ఏడీ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం యాడికిలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన ఉద్యమ్ రిజిస్ట్రేషన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. డ్వాక్రా సంఘాల సభ్యులు చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. ఈ సదస్సులో ఇండసీ్ట్రయల్ ప్రమోషన అధికారులు రవీంద్రనాథ్‌రెడ్డి, నిశాంత, శ్రీనాథ్, భువనేశ్వరి, డీఆర్‌డీఏ వెలుగు ఏపీఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు.