ముందస్తు దసరా వేడుకలు
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:55 PM
స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ముందస్తు దసరా వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారు చిత్రపటాలకు మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పూజలు నిర్వహించారు.
తాడిపత్రి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ముందస్తు దసరా వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారు చిత్రపటాలకు మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పూజలు నిర్వహించారు. తాడిపత్రి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం భారీఎత్తున కేక్‌ను కట్‌చేశారు.