Share News

shortage కొత్తచెరువులో తాగునీటికి కటకట

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:19 AM

స్థానిక కొత్తచెరువులో పంచాయతీ బోర్లు కాలిపోయి పలు కాలనీలకు సుమారు 20 రోజుల నుంచి తాగునీరు సరఫరా కావడం లేదు.

 shortage కొత్తచెరువులో తాగునీటికి కటకట

కొత్తచెరువు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): స్థానిక కొత్తచెరువులో పంచాయతీ బోర్లు కాలిపోయి పలు కాలనీలకు సుమారు 20 రోజుల నుంచి తాగునీరు సరఫరా కావడం లేదు. స్థానిక బసవన్నకట్ట వీధి, ముస్లిం కాలనీ, బోయవీధి, గాంధీనగర్‌, బీసీ కాలనీల్లో ఈ సమస్య మరి తీవ్రంగా ఉంది. దీంతో ఆ కాలనీలకు చెందిన మహిళలు మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఽధర్నా చేపట్టారు. పంచాయతీ బోర్లు కాలిపోయి 20 రోజులు అవుతున్నా... వాటికి మరమ్మతులు చేయించకుండా.. అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. దీనిపై పంచాయతీ సర్పంచ, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీంతో పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నామని అన్నారు. కాగా, పంచాయతీ కార్యదర్శి సెలవులో ఉండటంతో... కనీసం వారికి సమాధానం చెప్పే వారే లేకపోవడంతో వారు వెనుతిరిగి వెళ్లారు. దీనిపై కొత్తచెరువు గ్రామ పంచాయతీ ఇనచార్జి సెక్రటరీ గోపాల్‌రెడ్డిని వివరణ కోరగా.. తాగునీటి బోర్‌ మోటార్‌కు రివైండింగ్‌ చేయించి.. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

Updated Date - Mar 19 , 2025 | 12:19 AM