Share News

పిన్నేపల్లిలో తాగునీటి కష్టాలు

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:46 AM

మండలంలోని పిన్నేపల్లిలో తాగునీటి కోసం గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పిన్నేపల్లిలో తాగునీటి కష్టాలు
పిన్నేపల్లిలో తాగునీటి ట్యాంకర్‌ వద్ద రద్దీ

యాడికి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని పిన్నేపల్లిలో తాగునీటి కోసం గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని బోరుబావిలో నీళ్లు అడుగంటిపోవడంతో మూడు నెలల నుంచి ఈ సమ స్య నెలకొంది. సమస్యను గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా .. వారు తాత్కాలికంగా ట్యాంకర్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారే త ప్పా.. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం లేదు. కూలి పనులకు వెళ్లకుండా ట్యాంకర్‌ కోసం రోజూ ఎదురు చూడాల్సి వస్తోందని, నీరు కూడా చాల డం లేదని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పుడే నీటి సమస్య ఇలా ఉం టే ఇక వేసవికాలంలో తమ పరిస్థితి ఏమిటోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్‌ వచ్చినప్పుడు నీటికోసం గొడవ పడాల్సి వస్తోందన్నారు. అధికారులు, పాలకులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:46 AM