డీఎంఈగా డాక్టర్ రఘునందన
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:57 PM
అనంత విద్యార్థి, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రఘునందన రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్‌గా(డీఎంఈ) నియమితులయ్యారు. ఆయన తల్లి వసంతలక్ష్మి గుత్తి పట్టణానికి చెందినవారు. తండ్రి డాక్టర్ గోపాల్‌కృష్ణ కర్నూలుకు చెందినవారు. డాక్టర్ గోపాల్‌కృష్ణ ఎస్వీ మెడికల్ కాలేజీలో ఫార్మాకాలజీ ప్రొఫెసర్‌గా సేవలందించి రిటైర్డ్ అయ్యారు.
అంచెలంచెలుగా ఎదిగిన అనంత విద్యార్థి
గుత్తిలో పాఠశాల విద్య.. తిరుపతిలో వైద్య విద్య
అనంతపురం వైద్యం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): అనంత విద్యార్థి, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రఘునందన రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్‌గా(డీఎంఈ) నియమితులయ్యారు. ఆయన తల్లి వసంతలక్ష్మి గుత్తి పట్టణానికి చెందినవారు. తండ్రి డాక్టర్ గోపాల్‌కృష్ణ కర్నూలుకు చెందినవారు. డాక్టర్ గోపాల్‌కృష్ణ ఎస్వీ మెడికల్ కాలేజీలో ఫార్మాకాలజీ ప్రొఫెసర్‌గా సేవలందించి రిటైర్డ్ అయ్యారు. డాక్టర్ రఘునందన గుత్తి హైస్కూల్‌లో చదువుకున్నారు. కర్నూలులో ఇంటర్ పూర్తిచేశారు. ఎంబీబీఎస్, ఎంఎస్ తిరుపతిలో అభ్యసించారు. 1994లో డాక్టర్‌గా కడపలో సేవలను ప్రారంభించారు. నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం వైద్య కళాశాలల్లో సేవలందించారు. ఆయన భార్య మచిలీపట్నం మెడికల్ కాలేజీలో ఆప్తాలమిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ రఘునందనకు అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆర్థో విభాగాధిపతిగా, సూపరింటెండెంట్‌గా పనిచేశారు. అకడమిక్ డీఎంగా పదోన్నతిపై విజయవాడకు వెళ్లారు. పెద్దాస్పత్రిలో ఏర్పాటు చేసిన మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. డీఎంఈ పోస్టుకు అనేక మంది పోటీ పడ్డారు. కానీ ప్రభుత్వం ప్రతిభకు పట్టం కట్టిందని వైద్య వర్గాలు అంటున్నాయి. డీఎంఈగా డాక్టర్ రఘునందన నియామకంపట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ షోరోన సోనియ, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శంకర్, డాక్టర్ మధు, విభాగాధిపతులు డాక్టర్ శంకర్‌నాయక్, డాక్టర్ శాంతిరెడ్డి, డాక్టర్ దుర్గ, డాక్టర్ ఉమామహేష్, డాక్టర్ సరళ హర్షం వ్యక్తంచేశారు. సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారామ్, విభాగాధిపతులు డాక్టర్ రామస్వామినాయక్, డాక్టర్ షంషాద్ బేగం, డాక్టర్ భీమసేనాచార్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ భవాని, డాక్టర్ రాజేష్, డాక్టర్ మధుసూన, డాక్టర్ సురేష్, పరిపాలనా విభాగం అధికారులు డాక్టర్ శ్రీనివాస్ శౌరి, డాక్టర్ సౌజన్య కుమార్, ఆర్‌ఎంఓలు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ హేమలత, డాక్టర్ శివకుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.