ఫిర్యాదులు చేసినా పట్టించుకోరా..!
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:49 PM
మండలంలోని బండూరు, ఉద్ధేహళ్ గ్రామాల మధ్య ఉన్న రోడ్డు అధ్వానంగా మారిందని, పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసిన ఏ మాత్రం పట్టించుకోలేదని బండూరు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు
బొమ్మనహాళ్, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని బండూరు, ఉద్ధేహళ్ గ్రామాల మధ్య ఉన్న రోడ్డు అధ్వానంగా మారిందని, పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసిన ఏ మాత్రం పట్టించుకోలేదని బండూరు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ రోడ్డు వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. రోడ్డంతా గుంతలే ఉన్నాయని, వానొస్తే మొత్తం బురదమయం అవుతోందని వాపోయారు. ఈ రోడ్డు బాగు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. అనంతరం బొమ్మనహాళ్ తహసీల్దార్ మునివేలుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తిప్పేస్వామి, శివరాం, రవి, రామకృష్ణ, మహేంద్ర పాల్గొన్నారు.