ఘనంగా డోణ గంగమ్మ జాతర
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:09 AM
మండలంలోని టీ వీరాపురంలో డోఽణగంగమ్మ జాతర మహోత్సవాన్ని సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
రాయదుర్గంరూరల్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని టీ వీరాపురంలో డోఽణగంగమ్మ జాతర మహోత్సవాన్ని సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారికి గంగపూజ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, పుష్పాలంకరణ, వసా్త్రలంకరణ చేశారు. మధ్యాహ్నం అమ్మవారిని రథంలో ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు. ఏటా శ్రావణమాసం ముగింపు రోజున అమ్మవారికి ఈ జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు.