సమయపాలన పాటించని వైద్యులు
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:55 PM
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు.
బెళుగుప్ప, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. మంగళవారం డాక్టర్లు ఇద్దరు ఉండగా.. పదిన్నర గంటలు దాటినా ఎవరూ విధులకు హాజరుకాలేదు. ఎంపీహెచఈఓ ఫార్మసిస్టు సూపరింటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన కూడా రాలేదు. దీంతో జ్వరాలతో బాధపడుతున్న అనేక మంది సుమారు గంట సేపు వారికి కోసం నిరీక్షించారు. అనంతరం విధులకు వచ్చిన ఓ వైద్యుడ్ని టీడీపీ నాయకులు నిలదీశారు. అనేక మంది జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని, ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని నాయకుల రాము, యర్రిస్వామి ప్రశ్నించారు.