సమ్మెలో వైద్యులు - ఇబ్బందుల్లో రోగులు
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:44 AM
బొమ్మనహాళ్, శ్రీధరఘట్ట, దర్గాహొన్నూరు పీహెచసీల్లోని వైద్యు లు గత నెల 30 నుంచి సమ్మెలో వెళ్లారు. దీంతో ఆయా ఆస్పత్రులకు వచ్చే రోగులు వైద్యం అం దక ఇబ్బందులు పడుతున్నారు.
బొమ్మనహాళ్ అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): బొమ్మనహాళ్, శ్రీధరఘట్ట, దర్గాహొన్నూరు పీహెచసీల్లోని వైద్యు లు గత నెల 30 నుంచి సమ్మెలో వెళ్లారు. దీంతో జ్వరం, దగ్గు, వాం తు లు, చలి తదితర వాటితో ఆయా ఆస్పత్రులకు వచ్చే రోగులు వైద్యం అం దక ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల్లోని స్టాఫ్ నర్సులు, హెల్త్ అసిస్టెంట్లు తాత్కాలికంగా వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న రోగులు పక్కరాష్ట్రంలోని బళ్లారి, రూపనగుడి ప్రాంతాలకు వెళ్తున్నారు.