Share News

వైద్య కేంద్రం నిర్వాహకుడిపై డీఎంహెచఓ ఆగ్రహం

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:37 AM

స్థానికంగా ఓ ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసిన శివశంకర్‌.. మోకాళ్ల నొప్పుల నివారణకు ప్రమాదకర ఇంజక్షన్లు వేస్తున్నట్లు డీఎంహెచఓ ఈబీదేవికి ఫిర్యాదులు అందాయి.

వైద్య కేంద్రం నిర్వాహకుడిపై డీఎంహెచఓ ఆగ్రహం
నిర్వాహకుడిని హెచ్చరిస్తున్న డీఎంహెచఓ

యాడికి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): స్థానికంగా ఓ ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసిన శివశంకర్‌.. మోకాళ్ల నొప్పుల నివారణకు ప్రమాదకర ఇంజక్షన్లు వేస్తున్నట్లు డీఎంహెచఓ ఈబీదేవికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమె బుధవారం ఆ చికిత్సా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు, అనుమతులు లేకుండా హార్మోన్ల ఇంజక్షన్లు, మాత్రలు వాడుతున్నట్లు గుర్తించి.. నిర్వాహకుడిని మందలించారు. ఆ కేంద్రాన్ని సీజ్‌ చేయాలని ఆదేశించారు. అయితే ఆ కేంద్రంలోనే నిర్వాహకుడి నివాసం ఉండడంతో కేంద్రాన్ని సీజ్‌ చేయకుండా.. కేవలం మందులను మాత్రమే సీజ్‌చేశారు.

Updated Date - Oct 16 , 2025 | 12:37 AM