నిరుపయోగంగా పీహెచసీ భవనం
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:16 PM
మండలంలోని దర్గాహొన్నూరులో రూ. రెండు కోట్లతో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని రెండేళ్ల కిత్రం నిర్మించారు.
బొమ్మనహాళ్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దర్గాహొన్నూరులో రూ. రెండు కోట్లతో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని రెండేళ్ల కిత్రం నిర్మించారు. నేటికీ దాన్ని నియోగించకుండా అధికారులు తాళమేసి ఉంచారు. ఆరోగ్యశాఖ అధికారులు పరికరాలు రాలేదంటూ భవనాన్ని తెరవకుండా అలాగే వదిలేశారు. వైద్య సిబ్బంది విలేజ్ క్లీనిక్‌లో ఇరుకు గదుల్లోనే వైద్యం అందిస్తున్నారు. అందులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు బళ్లా రి, రూపనగుడి, ఉరవకొండ ప్రాంతలకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ ఆసుపత్రి భవనం ప్రారంభించాలని గ్రామస్థులు కోరుతున్నారు.