CMRF cheques సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:08 AM
రాప్తాడు నియోజకవర్గంలోని 34 మందికి రూ. 20 లక్షల మేర సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైం ది. అందుకు సంబంధించిన చెక్కులను ఆయా లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప రిటాల సునీత నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అందజేశారు.
అనంతపురం క్రైం, ఆగస్టు8(ఆంధ్రజ్యోతి): రాప్తాడు నియోజకవర్గంలోని 34 మందికి రూ. 20 లక్షల మేర సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైం ది. అందుకు సంబంధించిన చెక్కులను ఆయా లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప రిటాల సునీత నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అందజేశారు.
అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు మండలాలకు చెం దిన 19 మందికి రూ. 12.10 లక్షలు, రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలకు చెందిన 15 మందికి రూ. 7.90 లక్షల విలువైన చెక్కులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాధితులకు అడిగిన వెంటనే సీఎం చంద్రబాబు సీఎంఆర్‌ఎఫ్ కింద సాయం అందించిన అండగా నిలుస్తున్నారని అన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారు లు సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే పరిటాల సునీతకు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..