మురుగుకాలువ సమస్యపై సమాలోచన
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:11 AM
పట్టణంలో గాంధీకట్ట వద్ద నుంచి నంద్యాల రోడ్డు వరకు ఉన్న మురుగునీటి కాలువతో పట్టణ వాసులు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి మున్సిపల్ అధికారులు, స్థానికులతో కలిసి గురువారం ఆ కాలువను పరిశీలించారు.
తాడిపత్రి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పట్టణంలో గాంధీకట్ట వద్ద నుంచి నంద్యాల రోడ్డు వరకు ఉన్న మురుగునీటి కాలువతో పట్టణ వాసులు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి మున్సిపల్ అధికారులు, స్థానికులతో కలిసి గురువారం ఆ కాలువను పరిశీలించారు. ఆ కాలువ స్థానంలో భూగర్భ కాలువను ఏర్పాటు చేసి.. దానిపై రోడ్డు వేస్తే సమస్య పరిష్కారమవుతుందనే నిర్ణయానికి వచ్చారు. కాలువ నిర్మాణానికి రూ. కోటి, దానిపై రోడ్డు నిర్మాణానికి రూ. 1.5 కోటి .. మొత్తం రూ. 2.5 కోట్లు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం మున్సిపాల్టీలో నిధులు లేకపోవడంతో తాను కొంత సొంత డబ్బులు ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటించగా.. మిగిలిన డబ్బులు ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చారు. దీంతో రెండునెలల్లో పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. ఆయన వెంట నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎస్వీ రవీంద్రారెడ్డి, లోకనాథ్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి, మున్సిపల్ అధికారులు ఉన్నారు.