అపరిశుభ్రంగా చీకలగురికి
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:15 AM
మండలంలోని చీకలగురికి గ్రామం అపరిశుభ్రంగా మారింది. ఏడాదిగా డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో మురుగు నిల్వ ఉంటోంది.
విడపనకల్లు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని చీకలగురికి గ్రామం అపరిశుభ్రంగా మారింది. ఏడాదిగా డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో మురుగు నిల్వ ఉంటోంది. బీసీ కాలనీ సమీపంలో మంచి నీటి ట్యాంక్‌కు కొళాయిలు లేకపోవడంతో నిత్యం తాగునీరు వృథా అవుతూనే ఉంటుంది. ఆ నీరు చుట్టుపక్కల ప్రాంతంలో, గ్రామంలో నిల్వ ఉంటోంది. దీంతో తీవ్ర దుర్వాసనతో పాటు దోమలూ విపరీతంగా పెరిగాయి. గ్రామం మొత్తం అపరిశుభ్రంగా ఉండటంతో దోమలు అధికంగా పెరిగి.. ఆరుబయట కూర్చోలేక పోతున్నామని, అనేక మంది రోగాల బారిన పడుతున్నారని ఆ గ్రామస్థులు వాపోతున్నారు.