శిథిలావస్థలో విద్యుత సబ్‌స్టేషన భవనం
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:07 AM
స్థానిక గ్రామ సచివాలయం వద్ద ఉన్న సబ్‌స్టేషన భవనం శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడి పడుతుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
బొమ్మనహాళ్, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి) స్థానిక గ్రామ సచివాలయం వద్ద ఉన్న సబ్‌స్టేషన భవనం శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడి పడుతుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవనం అసౌకర్యంగా ఉందని, విధులు నిర్వహించాలంటే ఇబ్బందిగా ఉందని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. అంతేకాకుండా భవనం వద్ద కంప చెట్లు భారీగా పెరిగాయని, వర్షం వస్తే భారీగా నీరు నిల్వ ఉంటోందని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.