Share News

విద్యుత సమస్యలపై ధర్నా

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:38 AM

‘మా ప్రాంతంలో అనేక కరెంటు స్తంభాలు ఒరిగి.. కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. కరెంటు వైర్లు పాతవి కావడంతో తెగిపడుతున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని చాలాసార్లు అధికారులను కోరాం. అయినా వారు పట్టించుకోవడం లేదు.’ అని మండలంలోని చెలిమేపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు వాపోయారు.

విద్యుత సమస్యలపై ధర్నా
ధర్నా నిర్వహిస్తున్న గ్రామస్థులు

బ్రహ్మసముద్రం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ‘మా ప్రాంతంలో అనేక కరెంటు స్తంభాలు ఒరిగి.. కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. కరెంటు వైర్లు పాతవి కావడంతో తెగిపడుతున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని చాలాసార్లు అధికారులను కోరాం. అయినా వారు పట్టించుకోవడం లేదు.’ అని మండలంలోని చెలిమేపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు వాపోయారు. దీంతో వారు బుధవారం మండల కేంద్రంలోని విద్యుత అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఇటీవల విద్యుత తీగలు తెగిపడటంతో ఓ పెంపుడు కుక్క చనిపోయిందన్నారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైందన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లానా వారు పట్టించుకోవడం లేదని వాపోయారు. మండల విద్యుత అధికారి మధ్యాహ్నం ఒంటి గంట అయినా కార్యాలయానికి రాకపోవడంతో వెనుదిరిగారు.

Updated Date - Aug 14 , 2025 | 12:38 AM