Share News

రెండేళ్లలో రూ.100 కోట్లతో అభివృద్ధి: విప్‌

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:33 PM

అధికారం చేపట్టిన రెండేళ్లలోపే పట్టణంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

 రెండేళ్లలో రూ.100 కోట్లతో అభివృద్ధి: విప్‌
భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే కాలవ

రాయదుర్గం, డిసెంబరు25(ఆంధ్రజ్యోతి): అధికారం చేపట్టిన రెండేళ్లలోపే పట్టణంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. రాబోయే మూడున్నర కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. పట్టణంలో మారెమ్మ గుడి, దుగ్గిలమ్మ గుడి వద్ద రూ. 56.60 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. అమృత పథకం కింద శివారు కాలనీలైన బిటిపి లే అవుట్‌, మల్లాపురం లేఅవుట్‌ లాంటి శివారు ప్రాంతాలకు రక్షిత మంచినీటి పరఫరా పనులను చేపడతామన్నారు. అర్బన ఇన్ర్పాస్ట్రక్చర్‌ డెవలప్మెట్‌ ఫండ్‌పేరుతో మరిన్ని కేంద్రం నిధులు తీసుకురాబోతున్నామన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 11:33 PM