Share News

MLA విద్యతోనే అభివృద్ధి

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:12 AM

విద్యతోనే జీవితంలో అభివృద్ధి, ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సాధ్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.

MLA విద్యతోనే అభివృద్ధి
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట

కదిరిఅర్బన, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): విద్యతోనే జీవితంలో అభివృద్ధి, ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సాధ్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. మండలంలోని ఎరుకులవాండ్లపల్లి వద్ద ఉన్న హరీష్‌ పాఠశాల 53వ వార్షికోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే, ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ, ఆర్టీఓ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ పార్థసారధి హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కరస్పాండెండ్‌ ఎంఎస్‌ కిరణ్‌, ప్రిన్సిపల్‌ ప్రశాంత, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ, డాక్టర్‌ రమణయ్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:12 AM