Share News

ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదినం

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:34 AM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ప్రము ఖ సినీనటుడు పవన కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా స్థానిక పోలీ్‌సస్టేషన సమీపంలో రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ ఇనఛార్జ్‌ కదిరి శ్రీకాంతరెడ్డి మంగళవారం నిర్వహించారు.

ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదినం
తాడిపత్రిలో పాల్గొన్న ఎమ్మెల్యే జేసీ అశ్మిత, జనసేన ఇనచార్జిలు

తాడిపత్రి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ప్రము ఖ సినీనటుడు పవన కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా స్థానిక పోలీ్‌సస్టేషన సమీపంలో రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ ఇనఛార్జ్‌ కదిరి శ్రీకాంతరెడ్డి మంగళవారం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి హాజరయ్యారు. కేక్‌కట్‌ చేసి... అందరికి స్వీట్లు పంచారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శిబిరంలో దాదాపు 150 మంది రక్తం దానం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో కిరణ్‌కుమార్‌, అయూబ్‌, కొండా శివ, రసూల్‌, మణికంఠ, నరసింహాచారి, సునీల్‌, దూద్‌వలి, బయపురెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 12:34 AM