రైతులకు జింకల దడ
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:22 AM
మండలంలోని రైతులను జింకల బెడద పట్టి పీడిస్తోంది. మండలంలో 15 వేల ఎకరాలకు పైగా ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు సాగు చేసుకోవచ్చు. జింకల భయంతో రైతులు వెనుకంజ వేస్తున్నారు.
బెళుగుప్ప, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని రైతులను జింకల బెడద పట్టి పీడిస్తోంది. మండలంలో 15 వేల ఎకరాలకు పైగా ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు సాగు చేసుకోవచ్చు. జింకల భయంతో రైతులు వెనుకంజ వేస్తున్నారు. వీటి బెడదతో ఒక్క పంట మాత్రమే అతికష్టమ్మీద సాగుచేసుకునే దుస్థితి నెలకొంది. వర్షాకాలానికి ముందుగానే ముంగారు పంటలు కొర్ర, ధనియాలు, ప్రొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలు సాగు చేసుకోవచ్చు. అయితే ఈ పంటలు వేసుకుంటే జింకలు వాటిని నాశనం చేస్తాయి. పొలాల్లో ఎక్కడ చూసినా జింకల మందలే కనిపిస్తాయి. ఒక్కొక్క మందలో సుమారు అరవైదాకా ఉంటాయి. వాటి జోలికెళితే కేసులు పెడతారనే భయం.. ఊరకుంటే పంట నాశనం నాశనం చేస్తాయనే బెంగ.. ఎటూ పాలుపోక దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. జింకల బెడద తప్పించేలా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.