Share News

Dcms: నియోజకవర్గానికో బ్రాంచ

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:36 PM

ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికో బ్రాంచ, గోడౌనలు ఏర్పాటు చేసి రైతులకు సేవలందిస్తామని డీసీఎంఎస్‌ (అనంతపురం ఉమ్మడి జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ) చైర్మన నెట్టెం వెంకటేశులు తెలిపారు. సోమవారం స్థానిక కమలానగర్‌లోని డీసీఎంఎస్‌ కార్యాలయంలో మహాజనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్‌ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టారు.

Dcms: నియోజకవర్గానికో బ్రాంచ

డీసీఎంఎస్‌ చైర్మన నెట్టెం వెంకటేశులు

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికో బ్రాంచ, గోడౌనలు ఏర్పాటు చేసి రైతులకు సేవలందిస్తామని డీసీఎంఎస్‌ (అనంతపురం ఉమ్మడి జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ) చైర్మన నెట్టెం వెంకటేశులు తెలిపారు. సోమవారం స్థానిక కమలానగర్‌లోని డీసీఎంఎస్‌ కార్యాలయంలో మహాజనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్‌ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరం వ్యాపార ప్రగతిని ఆయన సమీక్షించారు. రైతులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన ఎరువులు సబ్సిడీ ధరలకు అందజేస్తామని తెలిపారు. ఏడీసీసీ బ్యాంకు చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని సొసైటీలను సంస్థాగతంగా బలోపేతం చేస్తామని, సొసైటీల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సహకార శాఖ అసిస్టెంట్‌ రిజిసా్ట్రర్‌ మునికృష్ణారెడ్డి, డీసీఎంఎస్‌ జిల్లా మేనేజర్‌ విజయ్‌భాస్కర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ సత్యనారాయణరెడ్డి, అకౌంట్స్‌ అధికారి సుధాకర్‌రెడ్డి, ఏపీ రాష్ట్ర రజక కార్పొరేషన డైరెక్టర్‌ ఎనసీ పరమేష్‌, ఉమ్మడి జిల్లాలోని సొసైటీల చైర్మన్లు పాల్గొన్నారు.

సొసైటీల స్థలాలను కాపాడుకోవాలి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సొసైటీల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాల (ప్యాక్స్‌) చైర్మన్లు సోమవారం తెలిపారు. ఈమేరకు వారు ఏడీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు ముంటిమడుగు కేశవరెడ్డి, నెట్టెం వెంకటేశులును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం జిల్లా సహకార శాఖ అధికారి అరుణకుమార్‌, డీఎల్‌సీఓ వెంకటరామిరెడ్డిలను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

Updated Date - Sep 29 , 2025 | 11:36 PM