Share News

కమిటీలను ప్రకటించిన డీసీసీ అధ్యక్షుడు

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:44 PM

నియోజకవర్గంలోని మూడు మండలాలు, పట్టణాల కమిటీలను డీసీసీ అధ్యక్షుడు వై మధుసూదనరెడ్డి అనంతపురంలోని కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రకటించారు.

 కమిటీలను ప్రకటించిన డీసీసీ అధ్యక్షుడు
మహేంద్రకు నియామక ఉత్తర్వును అందజేస్తున్న డీసీసీ అధ్యక్షుడు

గుంతకల్లు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని మూడు మండలాలు, పట్టణాల కమిటీలను డీసీసీ అధ్యక్షుడు వై మధుసూదనరెడ్డి అనంతపురంలోని కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రకటించారు. గుంతకల్లు పట్టణ కమిటీ అధ్యక్షుడిగా ఎం మహేంద్ర, ఉపాధ్యక్షుడిగా జీ జీలాన, ప్రధాన కార్యదర్శిగా షేక్‌ జిలాని, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా రామచంద్ర, కార్యదర్శిగా టీ శ్రీనివాసులు, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడిగా ఉస్మాన, గుంతకల్లు మండల కమిటీ అధ్యక్షుడిగా బీ చంద్రశేఖర్‌, కార్యదర్శిగా నరసన్న, మండల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడిగా ముస్తఫాను ప్రకటించారు. అలాగే గుత్తి పట్టణ అధ్యక్షుడిగా సిరాజుద్దీన, మండల అధ్యక్షుడిగా ఈ రామిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ భాస్కర్‌, పామిడి పట్టణ అధ్యక్షుడిగా సాంబయ్య, మండల అధ్యక్షుడిగా జగన మోహన రెడ్డి, కార్యదర్శిగా షౌకత పేర్లను ప్రకటించారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి ఎస్‌ ఇమాంవలి, ఉపాధ్యక్షులు ఆలం నవాజ్‌, ఫిరోజ్‌ ఖాన పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 11:44 PM