ముగిసిన దర్గా హొన్నూరు ఉరుసు
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:20 AM
మండలంలోని దర్గాహొన్నూరులో నిర్వహిస్తున్న సయ్యద్ సర్మస్ వలి చిప్తి ఉరుసు ఉత్సవాలు మంగళవారంతో ముగిసాయి
బొమ్మనహాళ్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని దర్గాహొన్నూరులో నిర్వహిస్తున్న సయ్యద్ సర్మస్ వలి చిప్తి ఉరుసు ఉత్సవాలు మంగళవారంతో ముగిసాయి. మంగళవారం వన్నళ్లి గ్రామంలోని కే.పీ వండ్రప్ప ఇంటి నుంచి స్వామి వారి గుర్రం సవారీ సోమవారం అర్ధరాత్రి బయలుదేరి మంగళవారం వేకువజామున దర్గాహొన్నూరు దర్గాకు చేరింది. ముస్లింలు సంషేర్‌ను ఊరేగించారు.