ప్రమాదకరంగా విద్యుత తీగలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:32 AM
మండలంలోని రాయలచెరువులోని కొత్త ఇళ్లకాలనీలో అరటి తోటలకు వెళ్లే మార్గంలో కరెంట్ తీగలు తక్కువ ఎత్తులో ఉన్నాయి
యాడికి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాయలచెరువులోని కొత్త ఇళ్లకాలనీలో అరటి తోటలకు వెళ్లే మార్గంలో కరెంట్ తీగలు తక్కువ ఎత్తులో ఉన్నాయి. రైతులు అరటి పంటను లారీల్లో తరలించేటప్పుడు ఎక్కడ ఆ తీగలు తగిలి ఘోర ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ కరెంట్ తీగలు తగిలి అరటికాయలు కొట్టడానికి వచ్చిన ఒక కూలీ మరణించాడని, సమస్యను పరిష్కరించాలని ట్రాన్సకో అధికారుల దృష్టికి తీసుకుపోయినా.. వారు ఏ మాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.