వినియోగదారులే దేవుళ్లు
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:14 AM
వినియోగదారులే మనకు దేవుళ్లని, వారికి నాణ్యమైన విద్యుతను అందించి సంతృప్తిపర చాలని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతో్‌షరావు విద్యుతసిబ్బందిని ఆదేశించారు. బీడుపల్లి సంస్కృతి స్కూల్‌ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన విద్యుత సరఫరా, సానుకూల ప్రజా అవగాహన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
పుట్టపర్తి రూరల్/అనంతపురం టౌన, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ‘వినియోగదారులే మనకు దేవుళ్లని, వారికి నాణ్యమైన విద్యుతను అందించి సంతృప్తిపర చాలని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతో్‌షరావు విద్యుతసిబ్బందిని ఆదేశించారు. బీడుపల్లి సంస్కృతి స్కూల్‌ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన విద్యుత సరఫరా, సానుకూల ప్రజా అవగాహన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యుత సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో పుట్టపర్తి, కదిరి, డివిజనలలో కొన్నిమండలాల్లో వినియోగ దారులకు సంతృప్తికరమైన సేవలందించలేకపోయామనే విషయం తేలిందన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో పారిశ్రామికీకరణ కోసం ఆర్డీఎ్‌సఎస్ 222 ఫీడర్లకు సంబంధించి రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
విద్యుత అంతరాయాలు ఉండకూడదు
విద్యుత అంతరాయాలు కలగకుండా చూడాలని సిబ్బందిని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతో్‌షరావు ఆదేశించారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో అనంతపురం జిల్లా విద్యుతశాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అంతకుముందు జిల్లాలోని పరిస్థితులపై అధికారులతో ఆరా తీశారు. రెవెన్యూ కలెక్షన్లు, విద్యుత అంతరాయాలు, ట్రాన్సఫార్మర్ల ఫెయిల్యూర్లపై చర్చించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా ట్రాన్సఫార్మార్లు పాడైపోతే వాటి స్థానాల్లో వెంటనే మరొకటి ఏర్పాటు చేయాలన్నారు. మరమ్మతులకు వచ్చిన ట్రాన్సఫార్మర్లను త్వరితగతిన పూర్తి చేయా లన్నారు. లైన్లు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో వాటిని ముందుగానే గుర్తించి, వాటిని మార్పుచేసేలా చూడాలన్నారు. విద్యుత బకాయిలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో సీజీఎం వరకుమార్, శ్రీసత్యసాయి జిల్లా ఎస్‌ఈ సంపతకుమార్, అనంతపురం జిల్లా ఎస్‌ఈ శేషాద్రి శేఖర్, ఈఈలు రమేష్, రాజశేఖర్, డీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.