సమస్యల పరిష్కారానికి ‘కరెంటోళ్ల జనబాట’
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:52 PM
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని మండలంలోని గోనేహాళ్‌లో మంగళవారం నిర్వహించారు.
బొమ్మనహాళ్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని మండలంలోని గోనేహాళ్‌లో మంగళవారం నిర్వహించారు. బొమ్మనహాళ్ ఏఈఈ లక్ష్మిరెడ్డి వినియోగదారుల సమస్యలపై ఆరా తీశారు. పలు ఫిర్యాదులు స్వీకరించారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలు పరిష్కరించగా.. మరికొని త్వరగా పరిష్కరిస్తామని ఏఈఈ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లైనఇనస్పెక్టర్ హనీఫ్, జేఎల్‌ఎంలు మంజు, షణ్ముక, టీడీపీ నాయకులు వెంటరెడ్డి పాల్గొన్నారు.