Share News

Cultivation అరకొర పదునులోనే కంది సాగు

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:32 PM

మండలంలోని రైతులు కంది సాగును అరకొర పదునులోనే ప్రారంభించారు.

Cultivation అరకొర పదునులోనే కంది సాగు
ఎద్దుల గొర్రుతో కంది సాగు చేస్తున్న రైతులు

విడపనకల్లు, జూన 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని రైతులు కంది సాగును అరకొర పదునులోనే ప్రారంభించారు. ఉండబండ, చీకలగురికి, విడపనకల్లు, వేల్పుమడుగు, పెద్ద కొట్టాలపల్లి, పాల్తూరు గ్రామాల్లో సోమవారం రైతులు ఈ పనులు చేపట్టారు. జూన మొదటి వారం నుంచే కందిని సాగు చేయాల్సిన రైతులు ... నెల చివరిలో సాగుకు సన్నద్దం అయ్యారు. ఎర్ర నేల, నల్లరేగడిలోను విత్తును ప్రారంభించారు. ఇంకో వర్షం పడి ఉంటే పొలాలు మంచి పదును అయి ఉండేవని.. కానీ అదును దాటితే ఇబ్బందులు అవుతాయని అరకొర పదునులోనే విత్తనం సాగు చేస్తున్నట్లు రైతులు తెలిపారు.

Updated Date - Jun 24 , 2025 | 11:32 PM