Share News

ఊపందుకున్న పంటల సాగు

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:17 AM

హెచ్చెల్సీ నీరుకు తోడు వర్షాలు రావడంతో మండలంలో వరి పంటను రైతులు విస్తారంగా సాగు చేశారు.

ఊపందుకున్న పంటల సాగు
బొమ్మనహాళ్‌ వద్ద సాగైన వరి పంట

బొమ్మనహాళ్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): హెచ్చెల్సీ నీరుకు తోడు వర్షాలు రావడంతో మండలంలో వరి పంటను రైతులు విస్తారంగా సాగు చేశారు. మండలంలోని ఉద్ధేహాళ్‌, ఉంతకల్లు, గోనేహాళ్‌, లింగదహాల్‌, ఉప్పరహళ్‌, రంగాపురంక్యాంప్‌ తదితర గ్రామాల్లో వరి సాగు చేశారు. మొత్తం ఇప్పటి వరకు ఐదు వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వ్యవసాయాధికారి సాయికుమార్‌ తెలిపారు. అలాగే అన్ని పంటలకు ఈ వర్షాలు బాగా ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. సజ్జ 200 ఎకరాలు, మొక్కజొన్న 2,200 ఎకరాలు, కందులు 2,470ఎకరాలు, ఆముదం 271 ఎకరాలు, పత్తి 745 ఎకరాలల్లో సాగు చేశారని తెలిపారు. వరి సాగు ఇంకా తొమ్మిది వేల ఎకరాలు సాగు అయ్యే అవకాశమున్నట్లు అంచన వేస్తున్నామన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:17 AM