క్వారీతో పంట నష్టం
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:06 AM
క్వారీలో వేలుళ్లతో ఏర్పడే దుమ్ముధూళి వల్ల తన పొలంలోని పంటలు నాశనం అవుతున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండలంలోని ముదిగల్లు గ్రామానికి చెందిన రైతు బొమ్మయ్య విలపించాడు.
కళ్యాణదుర్గం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): క్వారీలో వేలుళ్లతో ఏర్పడే దుమ్ముధూళి వల్ల తన పొలంలోని పంటలు నాశనం అవుతున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండలంలోని ముదిగల్లు గ్రామానికి చెందిన రైతు బొమ్మయ్య విలపించాడు. జీవితంపై విరక్తి చెందిన అతను గురువారం తన కూతురు భారతితో కలసి క్యారీలోని కొండపైకి ఎక్కా డు. ‘ నాకు 20 ఎకరాల పొలముంది. అందులో మొక్కజొన్న, వేరుశనగ సాగు చేస్తున్నా. నా పొలానికి సమీపంలో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి క్వారీ ఉంది. అందులో తరచూ పేలుళ్లు జరుగుతుండటంతో దాని వల్ల ఏర్పడే దుమ్ముధూళి పూర్తిగా నా పొలం లో పండుతుండటంతో పంటలు నాశనం అవుతున్నాయి. పోలీసులకు, అధికారులకు చానాసార్లు చెప్పినా.. పట్టించుకోలేదు. నాకు అన్యా యం జరుగుతోంది. ఇక నేను బతకలేను. కొండపైనుంచి దూకి ఆత్మహత్య చే సుకొంటున్నా.. ’ అంటూ ఓ సెల్ఫీ వీడియాను తన సెల్‌లో తీసి.. సోషల్ మీడియాతో పోస్ట్ చేశాడు. వెంటనే స్థానికులు స్పందించి.. విషయాన్ని కళ్యాణదుర్గం తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దార్ వెంటనే స్పందించి బాధితుడితో ఫోనలో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బొమ్మయ్య ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకున్నాడు.