Share News

కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:50 PM

తమతో ఖాళీ బాండ్లపై సంతకాలు తీసుకున్న కాంట్రాక్టర్లు వెంకటరావు, గౌతమ్‌, కిరణ్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టాలని శ్రీరామ్‌రెడ్డి తాగునీటి పథకం కార్మికులు డిమాండ్‌ చేశారు.

కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి
రిలేదీక్ష చేస్తున్న కార్మికులు

కళ్యాణదుర్గంరూరల్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): తమతో ఖాళీ బాండ్లపై సంతకాలు తీసుకున్న కాంట్రాక్టర్లు వెంకటరావు, గౌతమ్‌, కిరణ్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టాలని శ్రీరామ్‌రెడ్డి తాగునీటి పథకం కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం వారు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రిలేదీక్షలు చేపట్టారు. వేతనం రూ. 18 వేలు ఇవ్వకుండా.. దౌర్జన్యంగా రూ. 11 వేలే ఇస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్‌, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాయుడు, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి పరమేష్‌, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:50 PM