Cpi: కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం ఊడిగం
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:37 AM
కార్పొరేట్ సంస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణవిమర్శించారు. పట్టణంలో సీపీఐ పట్టణ 14వ మహా సభలను శనివారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి మొయినరోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఆంధ్రబ్యాంక్ రోడ్డు నుంచి పాత బస్టాండ్‌లోని బహిరంగ ప్రదేశం వరకు ర్యాలీ నిర్వహించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
గుంతకల్లుటౌన, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): కార్పొరేట్ సంస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణవిమర్శించారు. పట్టణంలో సీపీఐ పట్టణ 14వ మహా సభలను శనివారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి మొయినరోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఆంధ్రబ్యాంక్ రోడ్డు నుంచి పాత బస్టాండ్‌లోని బహిరంగ ప్రదేశం వరకు ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం పనిచేయడం లేదని కేవలం అంబానీ, అదాని వంటి కార్పొరేట్ సంస్థల కోసమే పని చేస్తున్నాడని ధ్వజమెత్తారు. దేశం మొత్తం దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని చూస్తున్నాడన్నారు. ప్రజలు బీజేపీ మాయ మాటను నమ్మవద్దన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడి బీజేపీని గద్దెదింపాలని పిలుపునిచ్చారు.
జగనరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన మొత్తం పోలీసుల చేతిల్లో పెట్టి, బటన్లు నొక్కడం పనిగా పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. అందుకే ప్రజలు రెండు బటన్లు నొక్కి గద్దె దింపారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇతర దేశాలకు వెళ్లి అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజలపై పెనుభారాన్ని మోపుతోందన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల కోసం పోరాడుతున్నది ఒకే ఒక్క పార్టీ అది కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్, కౌన్సిల్ సభ్యులు మురళీకృష్ణ, జాన్సనబాబు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజే్‌షగౌడ్, కౌన్సిలర్ లక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బీ గోవిందు. నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, సహాయ కార్యదర్శి మహేష్, పట్టణ కార్యదర్శి గోపినాథ్, సహాయ కార్యదర్శి ఎస్‌ఎండీ గౌస్, మండల కార్యదర్శి రాము, సహాయ కార్యదర్శి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.