ప్రజాసమస్యలపై సీపీఐ సామూహిక దీక్ష
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:35 AM
పట్టణంలో తిష్టవేసిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం సామూహిక దీక్షలు చేపట్టారు.
గుంతకల్లుటౌన, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): పట్టణంలో తిష్టవేసిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం సామూహిక దీక్షలు చేపట్టారు. సపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్ మాట్లాడుతూ... గుంతకల్లు పట్టణం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వడంలేదని విమర్శించారు. అర్ధాతరంగా ఆగిపోయిన గుంతకల్లు-గుత్తి జాతీయ రహదారి పనులను తక్షణమే ప్రభుత్వం పునః ప్రారంభించాలన్నారు. కసాపురం రోడ్డులో, బళ్లారి గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలన్నారు. ఆలూరు, ఉరవకొండ, గుత్తి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఉర్దూ కళాశాలను వెంటనే ప్రారంభించాలన్నారు. దీక్షలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బీ గోవిందు, ఏజీటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్, సీపీఐ నాయకులు మహేష్, గోపినాథ్, ఎస్‌ఎండీ గౌస్, రామాంజినేయులు, దేవేంద్ర, దాసరి శ్రీనివాసులు, మల్లయ్య, దౌలా కూర్చున్నారు. దీక్షలకు మున్సిపల్ చైర్‌పర్సన ఎన భవాని, న్యాయవాది చెన్నకేశవ సంఘీభావం తెలిపారు.