యూరియా కొరతపై సీపీఐ ఆందోళన
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:11 AM
రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు, రైతు సంఘం నాయకులు పలు ప్రాంతాల్లో సోమవారం ఆందోళన చేపట్టారు.
ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్ : రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు, రైతు సంఘం నాయకులు పలు ప్రాంతాల్లో సోమవారం ఆందోళన చేపట్టారు. బొమ్మనహాళ్‌లో తహసీల్దార్ మునివేలు వినతి పత్రం అందించారు. అలాగే గుంతకల్లులో తహసీల్దార్ రమాదేవికి, గుత్తిలో తహసీల్దార్ పుణ్యవతికి, కుందుర్పిలో తహసీల్దార్ ఓబులే్‌షకు, విడపనకల్లులో తహసీల్దారు రమాదేవికి, యాడికిలో డిప్యూటి తహసీల్దార్ శ్రీనివాసులుకు, పెద్దవడుగూరులో తహసీల్దార్ ఉషారాణికి, కళ్యాణదుర్గంలో తహసీల్దార్ భాస్కర్‌కు వినతి పత్రాలను అందజేశారు. తాడిపత్రి అగ్రికల్చర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.