Share News

illegal construction అక్రమ కట్టడాలపై అట్టుడికిన కౌన్సిల్‌

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:47 PM

పట్టణంలో అక్రమ కట్టడాలపై పలువురు కౌన్సిలర్లు టౌనప్లానింగ్‌, కమిషనర్‌ను నిలదీశారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో ఫ్యానల్‌ చైర్‌పర్సన హరణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

illegal construction అక్రమ కట్టడాలపై అట్టుడికిన కౌన్సిల్‌
సమావేశంలో మాట్లాడుతున్న సభ్యులు

కదిరి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): పట్టణంలో అక్రమ కట్టడాలపై పలువురు కౌన్సిలర్లు టౌనప్లానింగ్‌, కమిషనర్‌ను నిలదీశారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో ఫ్యానల్‌ చైర్‌పర్సన హరణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అజెండాలోని కొన్ని అంశాలు తప్ప మిగిలిన అంశాలు ఆమోదించారు. అనంతరం 0 సమయంలో పలువురు కౌన్సిలర్లు సమస్యలను విన్నవించారు. 24వార్డులో మున్సిపల్‌ స్థలాన్ని అక్రమించుకుని అక్రమ నిర్మాణం చేస్తుంటే అధికారులు నిద్రపోతున్నారా అని ఆ వార్డు సభ్యుడు ముస్తఫా అధికారులను ప్రశ్నించారు. మూడంతస్తుల భవనం కట్టెంతవరకు అఽధికారులు చర్యలు తీసుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ విషయంలో ముస్తఫా, కమిషనర్‌ మధ్య వాగ్వివాదం జరిగింది. కమిషనర్‌ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే నోటీలిచ్చామని, అక్రమ నిర్మాణం అయితే ఆపివేస్తామని అన్నారు. నాల్లో వార్డు సభ్యుడు కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఆర్‌టీ క్లబ్‌కు మున్సిపల్‌ నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అయితే దీనికి పలువురు సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఎంతోమంది విద్యార్థులను వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్నారని, దీనికి నిధులు కేటాయించాలని మెజార్టీ సభ్యులు చెప్పడంతో దానికి ఆమోదం తెలిపారు. 31వార్డు సభ్యురాలు బీబీజాన మాట్లాడుతూ తమ వార్డులో మురుగునీరు, చెత్త సమస్యలున్నాయన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:47 PM