అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలి
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:52 PM
మున్సిపాల్టీలో ఉద్యోగ విరమణ పొందిన పారిశుధ్య కార్మికుల స్థానంలో అప్కాస్ పద్ధతిలో ఎనిమిది మంది నియమించేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయని, దీనిపై విచారణ జరిపించాలని టీడీపీ కౌన్సిలర్ ఆర్ పవనకుమార్ గౌడ్ కోరారు.
గుంతకల్లు టౌన, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మున్సిపాల్టీలో ఉద్యోగ విరమణ పొందిన పారిశుధ్య కార్మికుల స్థానంలో అప్కాస్ పద్ధతిలో ఎనిమిది మంది నియమించేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయని, దీనిపై విచారణ జరిపించాలని టీడీపీ కౌన్సిలర్ ఆర్ పవనకుమార్ గౌడ్ కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో మంగళవారం చైర్‌పర్సన ఎన భవాని అధ్యక్షతను మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్లు కృపాకర్, చాంద్‌బాషా మాట్లాడుతూ.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పంపింగ్ చేసే మోటర్ల దొంగతనం విషయంలో ఇంత వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. స్టేషన రోడ్డులో ఆక్రమణలను తొలగించాలని కౌన్సిలర్ సుమో బాషా కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నయీమ్ ఆహ్మద్, అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన సభ్యులు పాల్గొన్నారు.