Share News

కార్పొరేట్‌ సెలూన్లను తొలగించాలి

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:53 PM

నాయీ బ్రాహ్మణుల కడుపు కొడుతున్న కార్పొరేట్‌ సెలూన్లను తొలగించాలని, కొత్తవాటికి అనుమతులు ఇవ్వరాదని క్షౌర వృత్తిదారుల సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

కార్పొరేట్‌ సెలూన్లను తొలగించాలి
కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

గుంతకల్లు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): నాయీ బ్రాహ్మణుల కడుపు కొడుతున్న కార్పొరేట్‌ సెలూన్లను తొలగించాలని, కొత్తవాటికి అనుమతులు ఇవ్వరాదని క్షౌర వృత్తిదారుల సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కమిషనర్‌ నయ్యీం అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో క్షౌర వృత్తిదారుల సంఘ జిల్లా కన్వీనరు బీ శ్రీనివాసులు, అధ్యక్షుడు బీ లక్ష్మీనారాయణ, కార్యదర్శి సూరి, కోశాధికారి ఎం బ్రహ్మకుమార్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 11:53 PM