ట్రాన్సఫార్మర్లలోని కాపర్ చోరీ
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:17 PM
మండలంలోని బోయలపల్లి గ్రామ రైతు ప్రకాష్ పొలంలో ట్రాన్సకో అధికారులు ఏర్పాటు చేసిన రెండు ట్రాన్సఫార్మర్లను దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేసి.. అందులోకి కాపర్ వైర్‌ను ఎత్తుకెళ్లారు.
కళ్యాణదుర్గంరూరల్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని బోయలపల్లి గ్రామ రైతు ప్రకాష్ పొలంలో ట్రాన్సకో అధికారులు ఏర్పాటు చేసిన రెండు ట్రాన్సఫార్మర్లను దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేసి.. అందులోకి కాపర్ వైర్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో దాదాపు 50 ఎకరాలకు నీటి సరఫరా అగిపోయినట్లు రైతులు వాపోతున్నారు. తాము టమోటా, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తున్నామని, ఈ దొంగతనాలను అరికట్టేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.