రాయదుర్గం అభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:25 AM
నియోజకవర్గాన్ని అభివృద్ధి చే యడానికి సహకరించాలని పారిశ్రామికవేత్తలను విప్ కాలవ శ్రీనివాసులు కోరారు
డీ.హీరేహాళ్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాన్ని అభివృద్ధి చే యడానికి సహకరించాలని పారిశ్రామికవేత్తలను విప్ కాలవ శ్రీనివాసులు కోరారు. జిల్లా స్పాంజ్ ఐరన మ్యానుఫ్యాక్చరింగ్ అసోషియేషన ఆధ్వర్యంలో కేంద్రంలో నిర్మించిన కళ్యాణమండపాన్ని గురువారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వస్తే వారికి అనువైన భూమిని కేటాయించటంతో పాటు రాయితీలు, ఇతర సౌకర్యాలు కూటమి ప్రభు త్వం ద్వారా కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్ ఛైర్మన హనుమంతరెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన డైరెక్టర్ నాగళ్లి రాజు, మండల కన్వీనర్ పాటిల్ మోహనరెడ్డి, ఎంపీటీసీలు తలారి గంగాధర, మొండి మల్లికార్జున పాల్గొన్నారు.